నయనతార హీరోయిన్ కాకపోతే ఏం చేసేదో తెలుసా?
TV9 Telugu
01 Aug 2024
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ వెలుగొందుతోన్న నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
తెలుగు,కన్నడ,తమిళ భాషల్లో బిజీగా సినిమాలు చేసే ఈ అందాలభామ ఇప్పుడు బాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల్లో నయన తార కూడా ఒకరు.
ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోన్న ఈ అందాల తార మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నయన తార తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇందులో భాగంగా తాను హీరోయిన్ అవ్వకపోయి ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యేదాన్నంటూ ఎవరికీ తెలియని విషయం షేర్ చేసుకుంది.
నేను ఇంగ్లీష్ లిటరేచర్ లో బి.ఏ చదువుకున్నాను. సినిమాల్లోకి రాకముందు చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని కలలు కనేదాన్ని' .
'అయితే సినిమాల్లో అడుగుపెట్టడం అనుకోకుండా జరిగిపోయింది. చంద్రముఖి సినిమా కెరీర్ ను మలుపు తిప్పింది' అని నయన్ చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..