TV9 Telugu
ఆ వార్తలకు విఘ్నేష్ చెక్.. చెర్రీ సినిమా సరిగమలు..
05 March 2024
నయనతార - విఘ్నేష్ శివన్ జంట ఎప్పుడూ ఎదో ఒక టాపిక్ తో వార్తల్లో ఉంటూనే ఉంటారు. తాజాగా మరోసారి ఇదే జరిగింది.
నయనతార - విఘ్నేష్ విడిపోతున్నారా? అంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు విఘ్నేష్ శివన్.
తాజాగా సోషల్ మీడియాలో నయనతారతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ గాసిప్స్ కి చెక్ పెట్టినట్టు అయింది.
ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్సకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్‌చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా పూర్తవగానే బుచ్చిబాబు సినిమా సెట్లోకి వెళ్తారు చెర్రీ. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా కంఫర్మ్ కాలేదు.
ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తారు. ప్రస్తుతం రెహమాన్, బుచ్చిబాబు సానా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి