భర్తను 20 రోజులు వదిలి ఉండలేకపోయిన నయనతార?
TV9 Telugu
31 March 2024
నయనతార ప్రస్తుతం సినిమాల కంటే ఫ్యామిలీ లైఫ్‌కే టైం ఎక్కువగా కేటాయిస్తోంది. విఘ్నేశ్ శివన్ లేని లోటు ఫీలవుతోంది.
విఘ్నేశ్ శివన్ తన సినిమా ఎల్‌ఐసీ షూటింగ్ కోసం 20 రోజులు సింగపూర్ వెళితే పిల్లలతో నయన్ చెన్నైలో ఉండిపోయింది.
20 రోజుల తర్వాత విఘ్నేశ్‌ని చూసి పిల్లలు హ్యాపీగా పీలయ్యారనీ ఎంతగానో మిస్ అయ్యారనీ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
భర్తను అలా వదిలి నయన్ ఉండలేకపోయిందని తెలుస్తోంది. ఇక పిల్లలు సైతం తండ్రి కోసం బాగానే అల్లరి చేసినట్టు అర్థం అవుతోంది.
నయన్ ప్రస్తుతం ఎటువంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లడం లేదు. అన్నపూరని మూవీ టైంలో వచ్చిన వివాదానికి వెంటనే ముగింపు పలికింది.
తనకు దేవుడంటే నమ్మకమని, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటానని, తాను ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది.
ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించండి అంటూ కోరింది. నయనతార చివరగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించింది.
ఇటీవల జవాన్ మూవీతో బాలీవుడ్ లో కథానాయకిగా పరిచయం అయింది. ఇది బ్లాక్ బస్టర్ కావడంతో హిందీలో వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి