నయనతార కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారా?

TV9 Telugu

10 March 2024

ఏంటి మేడమ్‌ ఎందుకంత కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు? అని గట్టిగా అడగాలనిపిస్తుంది హీరోయిన్ నయనతారని చూస్తే.

ఆమె బేసిగ్గా ఎమోషనల్‌ పర్సన్‌. ఏ విషయంలోనైనా త్వరగా స్పందిస్తారనే పేరుంది లేడీ సూపర్ స్టార్ నయన్‌కి.

అందుకే ఎప్పుడూ కూడా సౌత్ ఇండియన్ స్టార్ కథానాయకి నయనతార సోషల్‌ మీడియాకి వీలైనంత వరకు దూరంగా ఉండేవారు.

కానీ, జవాన్‌తో బాలీవుడ్‌కి వెళ్లినప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల్సిన సిట్చువేషన్‌ కనిపించింది నయన్‌కి.

అందుకే బాలీవుడ్ ఎంట్రీ కోసం సోషల్‌ మీడియాలోకి బ్లూ టిక్కులతో అఫిషియల్‌గా ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ నయన్‌.

అక్కడే అసలు సమస్యంతా మొదలైందని అంటున్నారు నియర్‌ అండ్‌ డియర్స్. అప్పటిదాకా నయన్‌ లైఫ్లో ఏం జరిగినా, అది జస్ట్ చిలవలుపలవలుగా వినిపించేది.

కానీ, ఇప్పుడు ప్రతిదీ ఆమె సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఆ మధ్య 'మ్‌.. ఐ యామ్‌ లాస్ట్ ' అని ఓ స్టేటస్‌ పెట్టారు నయన్‌. అదేదో పబ్లిసిటీ స్ట్రాటజీ అని అనుకున్నారు.

అంతలోనే విఘ్నేష్‌ని అన్‌ఫాలో కొట్టడం, మళ్లీ ఫాలో కావడం జరిగిపోయింది. ఇప్పుడు ఆ డ్యామేజ్‌ని కవర్‌ చేయడం కోసం ఫ్యామిలీ పిక్స్ ని తరచూ పోస్ట్ చేస్తున్నారు.