30 సెకన్లు కనిపించినందుకు 5 కోట్లు తీసుకున్న నయనతార..
Rajitha Chanti
Pic credit - Instagram
లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ ఇండస్ట్రీలో మొత్తం 75కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.
తమిళంలోకి అయ్యా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నయన్. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి మూవీతో ఇటు తెలుగు తెరకు పరిచయమైంది.
ఈమూవీ హిట్ కావడంతో అన్ని భాషల్లోనూ వరసు ఆఫర్స్ అందుకుని.. దక్షిణాది ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ గా దగ్గరయ్యింది. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తుంది.
గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నయనతార. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా 1000 కోట్లు రాబట్టింది.
దీంతో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ మూవీ హిట్ కావడంతో రెమ్యూనరేషన్ కూడా డబుల్ చేసింది.
సినిమాలు, వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తూ విపరీతమైన పారితోషికం తీసుకుంటుంది నయన్. ఇటీవల 30 సెకండ్స్ యాడ్ కోసం రూ. 5 కోట్లు తీసుకుందని టాక్.
జవాన్ తర్వాత నయన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి. అంతేకాకుండా ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి.
కానీ నయన్ మార్కెట్ మాత్రం దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నయన్.. మరో హిట్ ఖాతాలో చేరితే మరింత వసూలు చేస్తుందని అంటున్నారు.