నయనతార ఆస్తులు అన్ని కోట్లా

TV9 Telugu

01 March 2024

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలయిన్లు గా కొనసాగిన తారల్లో అత్యధికంగా ఆస్తులు కుడబెట్టిన ధనిక నటి మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.

గత 20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది అందరిని నటన తో మెప్పించింది.

ఆ తర్వాత తెలుగు, మలయాళ భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ గా జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేశారు.

దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ హీరోయిన్స్ లో నయనతార ఒకరు. తన నటన తో అనేక అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది నయన్.

అన్ని భాషల్లో నటించి మెప్పించటమే కాదు గట్టిగా సంపాదించింది కూడా. దేశంలోని అత్యంత ధనిక నటీమణులలో నయనతార ఒకరు.

ఆమె మొత్తం ఆస్తి విలువ దాదాపు 300 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల పైనే డిమాండ్ చేస్తుందట. 

 చెన్నై, హైదరాబాద్, కేరళ, ముంబై వంటి నగరాల్లో 4 విలాసవంతమైన ఇళ్ళు ఉండగా 100 కోట్ల విలువైన 4 BHK ఇల్లు కూడా కలిగి ఉంది.

అంతే కాదు ఆమె గ్యారేజ్ లో BMW 5 సిరీస్, Mercedes GLS 350T, టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫోర్డ్ ఎండీవర్ మరియు BMW 7-సిరీస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయట.

నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ నడుపుతోంది. నిర్మాణ సంస్థ విలువ 50 కోట్లుగా చెబుతున్నారు.

యూఏఈలో చమురు వ్యాపారంలో ఆమె దాదాపు 100 కోట్ల పెట్టుబడి పెట్టరని.. అంది ఆమె సోదరుడు చూసుకుంటారని టాక్.