అందులో కూడా సత్తా చాటుతున్న నయన్..

01 April 2024

TV9 Telugu

జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ సినిమాతో  తొలిసారి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏తో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. 

తాజాగా ఈ బ్యూటీ తన భర్త విఘ్నేశ్ శివన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. స్కిన్ కేర్ ప్రొడకక్ట్స్ బిజినెస్ ప్రారంభించారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ శివన్ ట్వీట్ చేశారు. 

ఆరేళ్ల మా కృషి, ప్రేమను ఈరోజు మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. మా అధికారిక ఖాతా 9skinofficialను గర్వంగా, సంతోషంగా ప్రకటిస్తున్నాము. 

ఎందుకంటే సెల్ఫ్ లవ్ ఎంతో ముఖ్యమని మేము నమ్మాం. ఈనెల 29 నుంచి మా ప్రయాణం మొదలు కానుంది. ఈరోజు నుంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మా వెబ్ సైట్ లో కొనుగోలు చేయొచ్చు. 

విఘ్నేశ్ శివన్ ట్వీట్ వైరలవుతుండగా.. దీనిపై నయన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు నయన్ తన ఇన్ స్టా ఖాతాలో ఈ ప్రొడక్ట్స్ సైట్ షేర్ చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది జవాన్ చిత్రం. దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. 

 ఇప్పటికే పలువురు సినీ తారలు వ్యాపార రంగంలో తమ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే రకుల్ ఫిట్ నెస్ సెంటర్స్ ఉండగా.. సాకీ బ్రాండ్ తో దుస్తుల రంగంలోకి దిగింది సామ్.

దాదాపు ఏడేళ్లు ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేశ్ శివన్ గతేడాది వివాహంతో ఒకటయ్యారు. వీరికి సరోగసి పద్దతిలో కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.