24 May 2024
ఐదోసారి ఆ స్టార్ హీరోకు జోడిగా నయన్.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్..
Rajitha Chanti
Pic credit - Instagram
సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ అంటే నయనతార అనే చెప్పాలి. దశాబ్దాలుగా దక్షిణాది చిత్రపరిశ్రమను ఏలేస్తున్న హీరోయిన్.
నాలుగు పదుల వయసులోనూ చేతినిండా సినిమాలతో కుర్రహీరోయిన్లకు చుక్కలు చూపిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది లేడీ సూపర్ స్టార్.
అటు వాణిజ్య ప్రకటనలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న నయన్.. వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటుంది.
జవాన్ సినిమాతో హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నయనతార ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో భారీ ప్రాజెక్ట్ ఒకే చేసిందట.
తమిళంలో హీరో అజిత్ ప్రధాన పాత్రలో కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కనుందట. ఇందులో కథానాయికగా నయనతారను ఎంపిక చేశారని టాక్.
వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ఏగన్, బిల్లా, ఆరంభం, విశ్వాసం సినిమాలు వచ్చాయి. ఏగన్ మినహా అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అయ్యాయి.
ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడి స్క్రీన్ పై ప్రేక్షకులను అలరించనుందట. ఐదోసారి ఈ జంట జత కట్టేందుకు రెడీ అయ్యిందని సమాచారం.
గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ పై రాబోతున్న ఈ సినిమాకు నయనతార దాదాపు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.