25 September 2024

బిగ్‏బాస్‏లోకి ఆ హాట్ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇక రచ్చే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‏బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే మూడు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. 

ప్రస్తుతం హౌస్‍లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఇప్పుడు నాలుగో వారం నడుస్తుండగా.. ఈ వారం కూడా మరో ఎలిమినేషన్ జరగబోతుంది. 

అయితే ఈసారి కూడా గత సీజన్ మాదిరిగానే హౌస్‏లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు ఉండనున్నట్లు తెలుస్తోంది. సీజన్ 8 గ్రాండ్ లాంఛ్ 2.0 ఉండనుంది.

తాజాగా హౌస్‏లోకి మరో బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదివరకే ఆమె  బిగ్‏బాస్‏లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని రోజులు గడిపింది. 

ఈసారి సీజన్ 8లోకి  బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. నెట్టింట ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది.

 గత సీజన్‌లో కూడా నయని వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ఇచ్చింది. కానీ వెళ్లిన ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ వారానికే మంచి పేరు తెచ్చుకుంది. 

టాస్కులు, డ్యాన్సులు, ఆటలు ఇలా అన్నింటిలో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ  దురదృష్టవశాత్తు వెళ్లిన వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది నయని పావని.

ఇక ఇప్పుడు సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరీ ఈసారి ఎన్ని వారాలు ఉంటుందో చూడాలి. ప్రస్తుతం నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుందని ఈ బ్యూటీ.