మళ్లీ జాతిరత్నంగా వస్తోన్న నవీన్ పోలిశెట్టి

TV9 Telugu

12 March 2024

ఆ వీడియోకి మూడేళ్లయినా మళ్లీ మళ్లీ చూసుకుని మురిసిపోతున్నారు టాలీవుడ్ యంగ్ హీరో మిస్టర్‌ నవీన్‌ పొలిశెట్టి.

అంతే కాదు, త్రో బ్యాక్‌ వీడియో ఇది... త్వరలోనే ఇలాంటి వీడియో మళ్లీ ఇంకోటి ఉంటుంది... నన్ను నమ్మండి అంటున్నారు.

ఇంతకీ నవీన్ అంతగా మురిసిపోతున్న ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా? అదే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

ఆయన నటించిన కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు సినిమా రిలీజ్‌ టైమ్‌లో ప్రొమోషన్స్ కోసం తీసుకున్న వీడియో అది.

ఆ చిత్రం విడుదలై మూడేళ్లయింది. ఇందులో నవీన్ తో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియా దర్శి కూడా ఈ చిత్రం నటించారు.

ఈ సినిమాలో వీరు ముగ్గురు కలిసి చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ప్రతి డైలాగూ వైరల్‌ అయింది.

ఇప్పుడు అంతకు మించిన నవ్వులు పంచే సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నారట యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి.

త్వరలోనే ఆ స్క్రిప్టుతో జనాల ముందుకు వస్తానని అంటున్నారు ఈ హీరో. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో హిట్ అందుకున్నారు.