నవీన్ పొలిశెట్టి.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాతిరత్నాలు సినిమాతో.. ట్యాలెంటెడ్ అండ్ స్టార్ పీస్‌గా రికగ్‌నైజ్ అయ్యారు.
తర్వాత ఓ క్రేజీ సినిమాతో ఎకంగా స్టార్ హీరోయిన్ అనుష్క కాంబోలో మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి గా ఈ నెల 7న సిల్వర్ స్క్రీన్స్ ను హిట్ చేస్తున్నారు.
ఈ కమ్రంలోనే ఈమూవీ ప్రమోషన్స్‌లో.. సింగిల్‌గా లీడ్ చేస్తున్నారు. తన సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.
కానీ ఈ మధ్యలోనే... తాజాగా జరిగిన ఈవెంట్లో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు సారీ చెప్పి.. తన నేచర్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈస్టార్ హీరో.
తాజాగా ఆయన మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమంలో సినిమా ఆలస్యం అయినందుకు మమల్ని క్షమించండి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడున్న వారందర్నీ షాక్ అయ్యేలా చేశారు.
అంతేకాదు షూటింగ్ కు చాలా సమయం పట్టిందని... పోస్ట్ ప్రొడక్షన్ పనులే ఈ సినిమా ఆలస్యానికి కారణం అంటూ సినిమా డిలే పై క్లారిటీ ఇచ్చారు.
త్వరలోనే అమెరికా కూడా వెళ్తున్నానని అక్కడ కూడా ఈ మూవీ ప్రమోషన్ షురూ చేస్తున్నట్టు చెప్పారు నవీన్ పొలిశెట్టి.
అయితే నవీన్ ..చాలా ఓపెన్ హార్టెడ్‌గా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట అందర్నీ ఆకట్టుకుంటూనే.. తెగ వైరల్ అవుతున్నాయి.