బాధ కలిగిందన్న నవీన్‌ మేడారం.. ఫైనల్‌కి చేరుకున్న భారతీయుడు..

30 December 2023

TV9 Telugu

తాజాగా విడుదలైన డెవిల్‌ సినిమాకు దర్శకుడిగా తనకు క్రెడిట్‌ ఇవ్వకపోవడం బాధ కలిగించిందని అన్నారు నవీన్‌ మేడారం.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్‌ సినిమాను తానే డైరక్ట్ చేశానని అన్నారు దర్శకుడు నవీన్ మేడారం.

దాదాపు 105 రోజులు కష్టపడి పూర్తి చేసిన డెవిల్‌ తనకు కేవలం ప్రాజెక్ట్ మాత్రమే కాదని, బిడ్డలాంటిదని అన్నారు నవీన్‌ మేడారం.

తాజాగా డిసెంబర్ 29న విడుదలైన డెవిల్ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇది యుద్ధం కాదు ఊచకోత అంటూ వీక్షకుల కామెంట్స్.

ఉలగ నాయగన్ కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజిలెంట్ యాక్షన్ చిత్రం సినిమా ఇండియన్‌2.

ఈ సినిమా షూటింగ్‌ ఫైనల్‌కి చేరుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన భారీ షెడ్యూల్‌తో టాకీ మొత్తం పూర్తయింది.

ఇంకో రెండు పాటల షూటింగ్‌ మాత్రమే బ్యాలన్స్ ఉందని.. త్వరలోనే ఈ షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తాం అన్నారు మేకర్స్.

భారతీయుడు చిత్రనికి కొనసాగింపుగా వస్తున్న భారతీయుడు 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పాన్ ఇండియా చిత్రం.