మరోసారి వైరల్ అవుతున్న లవ్ మౌళి అప్డేట్.. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదా.?

Anil Kumar

26 May 2024

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ టాలీవుడ్ మన్మధుడి లిస్టులో ఒకరైన నటుడు 'నవదీప్' హీరోగా నటిస్తున్న సినిమా ‘లవ్ మౌళి’.

న్యూ ఏజ్‌ మూవీగా ట్రెండ్‌ అవుతున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నిర్మిస్తున్నారు మూవీ మేకర్స్.

ఇప్పటికే విడుదలైన లవ్ మౌళి సినిమా ట్రైలర్ కూడా సినిమాపై మరింత ఆసక్తి పెంచేసింది అనే చెప్తున్నారు నెటిజన్స్.

తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ జరిగింది. తన కెరీర్‌కు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు నవదీప్.

జూన్ 7న ఈ లవ్ మౌళి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. అందరూ థియేటర్స్ లో చూడండి అన్నారు హీరో నవదీప్.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అనుకున్న టైం కి విడుదలకు సిద్ధం అవుతుంది.

ఈ సినిమాలో నవదీప్ లుక్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి.. మునుపేనందు చూడని విధంగా కనిపిస్తున్నాడు నవదీప్.

సిక్స్ ప్యాక్స్ బాడీతోపాటు లాంగ్ హోయిర్ తో గుర్తుపట్టలేని విధంగా వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు నవదీప్.