నటరత్నాలు ట్రైలర్ రిలీజ్.. విడుదలైన హ్యాపీ ఎండింగ్ ట్రైలర్..

TV9 Telugu

22 January 2024

ఇనయా సుల్తానా, సుదర్శన్‌ రెడ్డి, రంగస్థలం మహేష్‌, తాగుబోతు రమేష్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా నటరత్నాలు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దీనికి తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ దామోదరప్రసాద్‌, సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్‌, దర్శకులు కె.ఎస్‌.రవికుమార్‌ చౌదరి, సముద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ బావుందని మూవీ మేకర్స్ ని ప్రశంసించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

యష్‌ పూరి హీరోగా నటించిన తెలుగు సినిమా హ్యాపీ ఎండింగ్‌. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్ లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల విడుదల చేశారు.

న్యూ ఏజ్‌ సినిమా అని, క్లాసిక్‌ అప్రోచ్‌తో తెరకెక్కించామని అన్నారు మేకర్స్. ట్రైలర్‌ బావుందని అన్నారు వేణు ఊడుగుల.

టైటిల్‌కి తగ్గట్టే, నిర్మాతకు మంచి లాభాలు రావాలని ఆకాంక్షించారు. కౌషిక్ భీమిడి ఈ చిత్రానికి దర్శకుడు.