05 January 2024

OTTలో అదరగొడుతున్న హాయ్‌ నాన్న

TV9 Telugu

దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ సినిమా ‘హాయ్ నాన్న’.

కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానికి జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది.

తండ్రికూతురు బంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో మరోసారి ఫాదర్ పాత్రలో ఒదిగిపోయాడు నాని.

తండ్రికూతురి అనుబంధం.. అందమైన ప్రేమకథ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. 

‘హాయ్ నాన్న’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్.

ముందుగా అనౌన్స్ చేసినట్లే జనవరి 3 అర్ధరాత్రి నుంచి ‘హాయ్ నాన్న’ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

అప్పుడే ఓటీటీలోనూ .. దిమ్మతిరిగే రెస్పాన్స్‌ రాబట్టుకుంటోంది ఈ మూవీ.