24 November 2025

ఆమె అందానికి పడిపోయా.. ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. హీరో నాని..

Rajitha Chanti

Pic credit - Instagram

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సినీప్రియులను అలరిస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు  ఈ హీరో. 

హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా విభిన్న కంటెంట్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇటు హీరోగా.. మరోవైపు నిర్మాతగానూ సక్సెస్ అవుతున్నాడు.

ఇటీవలే నాని నిర్మాణంలో వచ్చిన కోర్టు మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే నాని నటించిన హిట్ 3 సైతం బ్లాక్ బస్టర్ హిట్టైన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు నాని. త్వరలోనే ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా తన ఫేవరేట్ హీరోయిన్ గురించి నాని చెప్పిన విషయాలు వైరలవుతున్నాయి. 

తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని గతంలో హిట్ 3 ప్రమోషనల్లో చెప్పుకొచ్చాడు. శ్రీదేవిని  ఎంతగానో ఆరాధించానని.. శ్రీదేవి, వెంకీ నటించిన క్షణక్షణం తనకెంతో ఇష్టమని అన్నారు. 

ఆ సినిమాను ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే మూవీ అని అన్నారు. అసలు శ్రీదేవి అంత అందంగా ఎలా ఉన్నారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చారు నాని.

ఇప్పుడు నాని చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి. ప్రస్తుతం నాని ప్యారడైజ్ చిత్రంలో నటిస్తుండగా.. అటు సుజీత్ దర్శకత్వంలోనూ మరో ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు నాని. ఇటు హీరోగా తన సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. ప్యారడైజ్ చిత్రంలో ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు.