ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. ఆమె అందానికే ఫిదా అయిపోయా.. నాని..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో నాని. ఇప్పుడు ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో నాని విభిన్న లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో తాజాగా నానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. హిట్ 3 ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్య్వలో పాల్గొన్నారు నా
అందులో నాని మాట్లాడుతూ.. తనకు హీరోయిన్ శ్రీదేవి అంటే చాలా ఇష్టమని అన్నారు. తాను శ్రీదేవిని ఎంతగానో ఆరాధించానని చెప్పుకొచ్చారు.
వెంకటేశ్, శ్రీదేవి కలిసి నటించిన క్షణక్షణం సినిమాను తాను ఎన్నో సార్లు చూశానని.. లక్షసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించే మూవీ అది అని అన్నారు.
శ్రీదేవి అంత అందంగా ఎందుకు ఉన్నారో ఇప్పటికీ అర్థం కావడంలేదని.. ఆ సినిమాకు శ్రీదేవి అందం తీసుకువచ్చారని ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు.
ఇటీవలే హాయ్ నాన్న, హిట్ 3 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు ప్యారడైజ్ సినిమాపై భారీగానే హైప్ పెరిగిపోయింది.
ప్రస్తుతం నాని ప్యారడైజ్ సినిమాతోపాటు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ పై అప్డేట్స్ రానున్నాయి.