TV9 Telugu

సరిపోదా శనివారం క్రేజీ అప్డేట్.. అక్కడ మ‌ల‌యాళ చిత్రాలు బంద్..

21 Febraury 2024

నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. దీని ఆడియో రైట్స్ సోనీ మ్యూజిక్ సంస్థ తీసుకుందని అధికారికంగా ప్రకటించారు.

విజయ్ దళపతి, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్, లియో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి.

తాజాగా ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. విజయ్ టైమ్ ఇస్తే కచ్చితంగా లియో 2 కూడా చేస్తానంటున్నారు లోకేష్.

కాకపోతే ఆయన లక్ష్యం వేరే అంటున్నారు లోకేష్. ఈ మధ్యే విజయ్ దళపతి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఓటిటి కారణంగా సినిమాలకు నష్టాలు వస్తున్నాయని.. మ‌ల‌యాళ చిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సినిమా ఓటీటీ రిలీజ్ గ్యాప్ 42 రోజులైతే.. నిర్మాతలు దాన్ని ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ FEUOK సాహసోపేతమైన నిర్ణ‌యం తీసుకుంది.

ఫిబ్రవరి 22 నుంచి మలయాళ చిత్రాలను ప్రదర్శించబోమని వాళ్లు హెచ్చరించారు. OTT విండో పీరియడ్ నిబంధనల ఉల్లంఘిస్తున్నందున ఇంత కఠినమైన నిర్ణయం.