TV9 Telugu
ఆశిష్ రెడ్డి రిసెప్షన్.. సరిపోదా శనివారం అప్డేట్..
23 Febraury 2024
నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న విజిలెంట్-సూపర్ హీరో చిత్రం సరిపోదా శనివారం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో నానికి జోడిగా ప్రియాంక మోహన్ కథానాయకిగా నటిస్తుంది.
ఫిబ్రవరి 24 (శనివారం)న నాని పుట్టిన రోజు సందర్బంగా సినిమా నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు మూవీ మేకర్స్.
సరిపోదా శనివారం మూవీ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. యూట్యూబ్ లో విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొనేలా ఉంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహం తాజాగా ఘనంగా జరిగింది.
ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆశిష్ రెడ్డి వివాహం ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 23 సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్‌లో మీడియాకు వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి