TV9 Telugu
సరిపోదా శనివారం ముచ్చట.. జోరుగా అఖిల్ కొత్త సినిమాకు ఏర్పాట్లు..
26 Febraury 2024
నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం సరిపోదా శనివారం.
ఫిబ్రవరి 24 (శనివారం)న నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
వారంలో వచ్చిన కోపాన్నంత ఒక్క రోజు మాత్రమే చూపించే పాత్రలో నాని నటిస్తున్నారు. ఎస్ జే కీలక పాత్రలో నటిస్తున్నారు.
నానికి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఆగస్ట్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు సరిపోదా శనివారం.
ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా నటించబోయే కొత్త సినిమాకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి.
అనిల్ అనే దర్శకుడితో ఈయన నెక్స్ట్ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. త్వరలోనే సినిమా సైట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం అఖిల్ కొత్త లుక్ లోకి వెళ్తున్నారు.
యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోసియో ఫాంటసీ నేపథ్యంలో అఖిల్ కొత్త సినిమా రాబోతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి