నాని 33 రెడీ..  భరతనాట్యం ముచ్చట్లు..

TV9 Telugu

02 April 2024

కచ్చితంగా ఏడాదికి మూడు సినిమాలు చేయాలని గట్టిగానే ఫిక్సయ్యారు టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని.

అందుకే ఓ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలు లైన్‌లో పెడుతున్నారు నాచురల్ స్టార్ నాని.

సరిపోదా శనివారం నాని 31వ సినిమా. ఇది సెట్స్‌పై ఉండగానే.. నాని 32 యంగ్ దర్శకుడు సుజీత్‌తో కమిటయ్యారు.

తాజాగా నాని 33 దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఫిక్సయ్యారు. అలాగే నాని 34 బలగం ఫేమ్ వేణు ఎల్దండితో ఉండబోతుంది.

సూర్య తేజ ఏలే ప్రధాన పాత్రలో నటిస్తున్న సంచలనాత్మక క్రైమ్ కామెడీ సినిమా ‘భరతనాట్యం’. ఇది ఆయనకి తొలి చిత్రం.

‘దొరసాని’ ఫేమ్ కెవిఆర్ మహేంద్ర ఈ సినిమాకు దర్శకుడు. దీనిలో మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్ మరియు 'టెంపర్' వంశీ ముఖ్య పాత్రధారులు. 'బ్రోచేవారెవరురా' ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందించారు.

ఏప్రిల్ 5న విడుదల కానుంది భరతనాట్యం.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.