TV9 Telugu

సరిపోతుందా ఈ యాక్షన్.? నాని రూటే మార్చారా.?

24 March 2024

సరిపోదా శనివారం షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా సాగుతుంది. ప్రతీ శనివారం ఏదో ఓ అప్‌డేట్ ఇస్తున్నారు మేకర్స్.

అలాగే ఈ శనివారం యాక్షన్ సీన్స్ గురించి చెప్పారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరో నాని చేతికి రక్తపు మరకలు కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ప్రధాన పాత్ర చేస్తున్నారు.

ఇదిలా ఉంటె హీరో నాని మంచి ఫామ్‌లో ఉన్నరు ఇప్పుడు. 2017 తర్వాత నానికి 2023 బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి.

2023 మొదట్లో దసరా, అదే ఇయర్ చివర్లో హాయ్ నాన్నతో దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసారు ఈ స్టార్ హీరో.

ఇదే ఫ్లో లో 2024లోనూ కొనసాగించాలని చూస్తున్న నాని క్లాస్ కంటే మాస్‌నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు న్యాచురల్ స్టార్.

నాని సరిపోదా శనివారం సినిమా షూటింగ్‌ 2024 మే లోపు పూర్తి కానుంది. ఆగస్ట్ 29న ఈ సినిమా విడుదల కానుంది.