న్యాచురల్ స్టార్ నాని గురించి ఇప్పటివరకు మీకు తెలియని విషయాలు..
TV9 Telugu
Pic credit - Instagram
ఫస్ట్ మూవీతోనే అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హీరో న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు నేడు. నేటితో 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు ఈ హీరో.
రేడియా జాకీగా పనిచేసే నాని.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అష్టాచమ్మా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమై హిట్ అందుకున్నారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ పక్కింటి కుర్రాడు.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తనకు తానే ఓ బ్రాండ్ గా నిలిచి ఎంతో మందికి స్పూర్తినిచ్చారు.
నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. 1984 ఫిబ్రవరి 24న ఏపీలోని చల్లపల్లిలో జన్మించాడు. తల్లిదండ్రులు హైదరాబాదులో స్థిరపడడంతో విద్యాభాస్యం ఇక్కడే జరిగింది.
సినిమాల్లో నటుడిగా అవకాశాల కోసం ఫోటో ఆల్బమ్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగాడు. చిన్న పాత్రలు కూడా రాకపోవడం.. డబ్బులు మోసపోవడం సహాయ దర్శకుడిగా చేరాడు.
ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత 2011లో నందిని రెడ్డి తెరకెక్కించిన అలా మొదలైంది మూవీతో కెరీర్ మలుపు తిప్పింది.
ఎన్నో సినిమాల్లో నటించిన నాని కెరీర్లో విజయాలతోపాటు అపజయాలు ఉన్నాయి. పైసా, జెండా పై కపిరాజు, ఆహా కల్యాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి.
దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. ఈ మూవీతో వందకోట్ల హీరోగా రికార్డుకెక్కారు. ఇటీవలే వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు.