TV9 Telugu

నాని32 ముచ్చట.. గామా అవార్డు గురించి అప్డేట్..

27 Febraury 2024

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ విజిలెంట్ సూపర్ హీరో చిత్రం సరిపోదా శనివారం బిజీగా ఉన్నారు.

ఇటీవల దీని తర్వాతి సినిమాను కూడా ప్రకటించారు న్యాచురల్ స్టార్. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజితో సుజీత్ బిజీగా ఉన్నారు. దీని తర్వాత నాని32 సినిమా తెరకెక్కించనున్నారు ఆయన.

నాని32కి డివివి దానయ్య నిర్మాత.  ఆయన నిర్మాణంలోనే సుజీత్ దర్శకత్వంలో ఓజి, నాని హీరోగా సరిపోదా శనివారం కూడా వస్తున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం గర్వపడేలా అవార్డు వేడుకను నిర్వహిస్తామని తెలిపింది గామా అవార్డు కమిటీ.

ఇటీవల జరిగిన కర్టన్‌ రైజర్‌ ఈవెంట్‌లో దుబాయ్‌లో జరగబోయే వేడుకకు సంబంధించిన విశేషాలు తెలియజేశారు కమిటీ మెంబర్స్‌.

గామా అవార్డు 4th ఎడిషన్‌కు సంబంధించి ఓ ట్రోఫినీ ఈ ఈవెంట్‌లో లాంచ్‌ చేశారు గామా అవార్డు కమిటీ సభ్యులు.

ఈ కార్యక్రమంలో జ్యూరీ చైర్మన్ కోటి, సభ్యులు వీఎన్ ఆదిత్య, రఘు కుంచె, డీవీవీ దానయ్య, సాయి రాజేష్ పాల్గొన్నారు.