భగవంత్ కేసరి నుంచి బాలయ్య బయటికి రాలేకపోతున్నారా..

10 October 2023

దసరాకు విడుదల కానున్న భగవంత్ కేసరి చిత్ర ప్రమోషనల్ పనుల్లో జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంఛ్ వేడుకకు భగవంత్ కేసరిగానే వచ్చారు బాలయ్య.

భగవంత్ కేసరి సినిమా చేస్తున్నప్పటి నుంచి ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు బాలయ్య.

అది సినిమా ప్రమోషన్ కోసమే చేస్తున్నారా లేదంటే నిజంగానే కారెక్టర్ అంతగా ఓన్ చేుసకున్నారో అర్థం కావడం లేదు.

ఈ మధ్యే పొలిటికల్ ప్రెస్ మీట్‌లోనూ బ్రో ఐ డోంట్ కేర్ అంటూ భగవంత్ కేసరి డైలాగ్ వాడేసారు నటసింహం బాలయ్య.

తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లోనూ పూర్తిగా తెలంగాణ స్లాంగ్‌లోనే మాట్లాడారు బాలయ్య. ఈ మేకోవర్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది.

ఎక్కడికి వెళ్లినా భగవంత్ కేసరిని తన బాడీలోనే ఇన్ బిల్ట్ చేసుకున్నారు బాలయ్య. సెంటిమెంట్ ప్రధానంగా ఉన్నా.. కమర్షియల్ హంగులన్నీ సినిమాలో పెట్టేసారు దర్శకుడు అనిల్ రావిపూడి.

అక్టోబర్ 19న విడుదల కానుంది భగవంత్ కేసరి. ట్రైలర్ చూసాక అంచనాలు మరింత పెరిపోయాయి. బాలయ్యను నెవర్ బిఫోర్ అవతారంలో ప్రజెంట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి.

దాన్ని ఆయన కూడా అలాగే తీసుకున్నారు. అందుకే బయట కూడా భగవంత్ కేసరిని ప్రమోట్ చేస్తున్నారు బాలయ్య. శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.