ఒకే ఇంటర్వ్యూలో అన్ని అనుమానాలకు తెరదించిన నాగవంశీ..
04 October 2023
చిరు లీక్స్‌లా.. వంశీ లీక్స్ మొదలయ్యాయిపుడు. ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే చాలు అన్ని సినిమాల సీక్రేట్స్ బయటపెడుతున్నారు నిర్మాత నాగవంశీ.
ఇప్పుడూ ఇదే జరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంపై చాలా రోజులుగా చర్చకి ఫుల్ స్టాప్ పెట్టారు నాగవంశీ.
బాలీవుడ్ సినిమా డేట్స్ క్లాష్ కారణంతో గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకున్నారని.. అంతకుమించి రీజన్ లేదని చెప్పుకొచ్చారు నాగవంశీ.
అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా బడ్జెట్ 100 కోట్లు అంటూ బాంబ్ పేల్చారు నిర్మాత నాగ వంశీ.
కరెక్ట్ సినిమా పడితే విజయ్ సంచలనం సృష్టిస్తారని తెలిపారు వంశీ. అంతేకాదు.. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీలీలానే అని.. రష్మిక ఉందనే వార్తలు అబద్ధమని తేల్చేసారు.
బాబీ, బాలయ్య సినిమాపై కూడా అప్‌డేట్ ఇచ్చారు నాగవంశీ. ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని.. బాలయ్య కారెక్టర్ నెవర్ బిఫోర్ అంటూ ఊరించారు.
అలాగే తమ బ్యానర్‌లో అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయని కన్ఫర్మ్ చేసారు నాగవంశీ.
మొత్తానికి ఒకే ఇంటర్వ్యూలో చాలా మంది హీరోల అప్‌డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు ఈ నిర్మాత.