రగడ జోడీ రిపీట్.. ఘనంగా సిద్ధూ బర్త్ డే పార్టీ..
TV9 Telugu
12 February 2024
14 ఏళ్ళ కింద వచ్చిన ‘రగడ’ సినిమాలో నాగార్జున, ప్రియమణి జంటగా నటించారు. ఈ సినిమాలో అనుష్క మరో హీరోయిన్.
వీరు పోట్ల ఈ సినిమాకు దర్శకుడు. ఇన్నేళ్ళకు మళ్లీ నాగార్జున, ప్రియమణి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తుంది.
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా సుబ్బు అనే ఓ కొత్త దర్శకుడితో ఓ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా పట్టాలెక్కబోతోంది.
ఇందులో నాగ్ లాయర్‌గా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా ప్రియమణి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ పుట్టినరోజు వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
దీనికి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు చాలా మంది వచ్చారు. మూడు రోజుల కింద జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దీనికి రానా, నవదీప్, శర్వానంద్, అల్లు అరవింద్, సందీప్ కిషన్, వైష్ణవి చైతన్య సహా చాలా మంది హాజరయ్యారు.
ప్రస్తుతం సిద్దు నటించిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. తెలుసు కదా అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి