TV9 Telugu
10 February 2024
ఓటీటీలో ‘నా సామిరంగ’.. అధికారిక ప్రకటన.. ఎప్పుడంటే.?
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ.
సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ మూవీ బాగా మెప్పించింది.
దీంతో నా సామిరంగ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించిన నా సామిరంగ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నాగ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.
తాజాగా ఫిబ్రవరి 17 నుంచి నా సామిరంగ ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
‘మరో వారం రోజుల్లో కింగ్ సినిమాను ఓటీటీలో చూడొచ్చు’ అంటూ ట్వీట్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి