07 February 2025

అబ్బాయిలు అలా ఉంటే సాయి పల్లవికి నచ్చుతారట.. 

Rajitha Chanti

Pic credit - Instagram

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు వచ్చింది. 

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సాయి పల్లవి ముందు పెట్టారు నాగచైతన్య. ఆమె నుంచి పలు ఆన్సర్స్ రాబట్టారు. 

అబ్బాయిలు ఎలాంటి డ్రెస్సులు వాడితే నచ్చుతారు అని అడగ్గా.. సాయి పల్లవి రియాక్ట్ అవుతూ నాకు తెలియదంటూ చెప్పుకొచ్చింది. 

నలిగిపోయిన బట్టలు వేసుకుంటే తనకు అసలు నచ్చదని.. తన ఫ్యామిలీలో ఎవరైనా అలా కనపడితే వాటికి సరిచేయడానికి ప్రయత్నిస్తుందట. 

దీంతో వెంటనే నాగచైతన్య కలగజేసుకుని అబ్బాయిలూ విన్నారుగా.. ఈసారి సాయిపల్లవిని కలిసే ముందు డ్రెస్ ఇస్త్రీ చేయండి అన్నారు. 

అలాగే దర్శకత్వం చేయాలనుకుంటే అని అడగ్గా.. ఎప్పటికీ చేయనని.. తనకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పడంతో చైతన్య రియాక్ట్ అయ్యారు. 

నువ్వు అబద్ధాలు చెబుతున్నావని.. ఇదే విషయాన్ని అడిగితే ఎప్పటికైనా దర్శకత్వం చేస్తానని.. తనను నటుడిగా తీసుకుంటానని చెప్పావు అన్నారు. 

ఇదిలా ఉంటే.. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన సినిమా తండేల్. అందమైన ప్రేమకథగా రూపొందించారు.