ఆ బడా చిత్రంతో తండేల్ పోటీ పడనుందా.? ఇంద్రాణి ట్రైలర్..
20 Febraury 2024
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా తండేల్. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాను దసరా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దసరాకి ఎన్టీఆర్ దేవర రానున్నట్లు ఇప్పటకే ప్రకటించారు.
అమీర్ ఖాన్ కెరీర్‌లో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ దంగల్. ఆ సినిమాలో అమీర్ రెండో కూతురు బబితా ఫోగట్‌గా నటించిన సుహానీ భట్నాగర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
దంగల్‌లో బాల నటిగా చేసిన సుహానీ భట్నాగర్ నటిగా బిజీ అవుతున్న సమయంలోనే తుది శ్వాస విడిచారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే అనారోగ్య కారణాలతో మరణించారు.
శివ కందుకూరి హీరోగా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. పురుషోత్తం రాజ్ ఈ సినిమాకు దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది.
ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టాలీవుడ్‌లో మొదటి AI జనరేటెడ్ సాంగ్‌ను విడుదల చేసారు మేకర్స్.
యానీయా భరద్వాజ్ ప్రధాన పాత్రలో వస్తున్న టైమ్ ట్రావెల్ సినిమా ఇంద్రాణి. దీనిలో ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
స్టెఫన్ పల్లం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇంద్రాణి ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.