నితిన్‍కు పోటీగా చై.. తండేల్
రిలీజ్ డేట్ ఎప్పుడంటే ??
TV9 Telugu
19 April 2024
గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లో చందూ మొండేటి దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా తండేల్.
ఈ చిత్రంలో హీరో నాగచైతన్య తండేలుగా కనిపిస్తాడు. బోట్స్ నడిపే వారిని 'తండేల్' అని అంటారు. అది చాలా పాత పదం.
గుజరాత్ లోని సూరత్ అనే ప్రాతం లో ఒక వ్యక్తి జీవిత కధను ఆధారంగా తీసుకుని 'తండేల్' సినిమా చిత్రీకరించారు.
ఒక అందమైన ప్రేమకథ అంతేకాదు ఇందులో ఊహించని ట్విస్టులు టర్న్స్ ఉంటాయి.. అలాంటి బోట్ డ్రైవర్ క్యారక్టర్ లో చైతన్య నటించనున్నారు.
చైతూతో చందు గతంలో 'ప్రేమమ్' 'సవ్యసాచి' వంటి సినిమాలను రూపొందించారు. ఇప్పుడు ఈ హ్యాట్రిక్ మూవీ అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. 2024 కిస్మస్ కు ఈ చిత్రం రిలీజ్ కాబోతోందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ చిత్రాన్ని డిసెంబరు 20న థియేటర్లలోకి తీసుకు రావాలని భావిస్తున్నారట 'తండేల్' టీం. అయితే అతి త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి