9 నెలలు కష్టపడ్డా:  చైతూ ఓపెన్..

TV9 Telugu

25 May 2024

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న మాస్ యాక్షన్ ఎంటెర్టైనెర్ చిత్రం తండేల్.

గీత ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చైతూ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది.

చైతూకి జోడిగా ఇందులో సాయి పల్లవి నటిస్తుంది. లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరూ జంటగా కనిపిస్తున్న చిత్రమిది.

పాక్ బలగాలకు పట్టుబడ్డ మత్స్యకారులు నేపథ్యంలో తెరక్కుతున్న చిత్రమిది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది.

దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాతలు.

ఇందులో చైతూ జాలరిగా కనిపించనున్నారు. ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు నాగ చైతన్య.

దాదాపు రెండేళ్లు పాక్ జైల్లో ఉండి భారత్‌కు తిరిగి వచ్చిన రాజు నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుందని నాగ చైతన్య తెలిపారు.

తండేల్ సినిమాలో ఈ పాత్ర కోసం 9 నెలలు వర్క్ చేసినట్లు తెలిపారు చైతూ. చూడాలి ఈ చిత్రం చైతూకి విజయాన్ని ఇస్తుందేమో.