బాలీవుడ్‌కు సినిమాల్లో చేస్తా.. చైతూ
TV9 Telugu
23 May 2024
రెండేళ్ళ కింద బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ ఛడ్డాలో కీలక పాత్రలో నటించారు నాగ చైతన్య.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. అందులో చైతూ పాత్రకు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది.
తాజాగా బాలీవుడ్ సినిమాల్లో నటించడం గురించి మరోసారి ఓపెన్ అయ్యారు అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. మంచి కథలు వస్తే తప్పకుండా హిందీలో నటిస్తానని తెలిపారు అక్కనేని అందగాడు.
ప్రస్తుతం తండేల్ సినిమాలో హీరోగా చేస్తున్నారు చైతూ. కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు.
మాస్ యాక్షన్ డ్రామా చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కితుంది ఈ సినిమా. చైతూ తొలి పాన్ ఇండియా చిత్రమిది.
సాయిపల్లవి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పాక్ బలగాలకు పట్టుబడ్డ మత్స్యకారులు నేపథ్యంలో తెరక్కుతున్న చిత్రమిది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి