నా తొలి ముద్దు ఆమెకే ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య..
Rajitha Chanti
Pic credit - Instagram
యువసామ్రాట్ అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య పుట్టినరోజు నేడు (నవంబర్ 23). ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చైతూ.. ఆ తర్వాత ఏమాయ చేసావే, ప్రేమమ్, లవ్ స్టోరీ, తండేల్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.
ప్రస్తుతం వృషకర్మ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ టైటిల్ లుక్ రివీల్ చేయగా.. సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఈ మూవీ తర్వలోనే రిలీజ్ కానుంది.
సమంతతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభితను పెళ్లి చేసుకున్నారు చైతూ. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శోభిత, చైతూ ఇద్దరు తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య తన తొలి ముద్దు ఎవరికీ ఇచ్చాడో తెలిపాడు.
గతంలో రానా నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న చైతూ.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తొలి ముద్దు గురించి చెప్పారు.
మొదటి ముద్దు ఎప్పుడు.? ఎవరికి పెట్టావో గుర్తుందా..? అని రానా అడగ్గా.. తొమ్మిదో తరగతిలోనే ఓ అమ్మాయికి మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని తెలిపారు చైతూ.
ఆ ముద్దు తన జీవితమంతా గుర్తుంటుందని.. అలాగే ఓ అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు.