30 November 2023

సమంత సిరీస్‌ గురించి నాగచైతన్య ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ 

నిన్న మొన్నటి వరకు సినిమాలతోనే బిజీగా ఉన్న చై..ఇప్పుడు సిరీసుల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. 

విక్రమ్ కె కుమార్‌ డైరెక్షన్లో.. ధూత వెబ్‌సిరీస్‌ చేస్తున్నారు.  

ఇక ఆ సిరీస్‌ ప్రమోషన్లో భాగంగానే.. దేశమంతా చుట్టేస్తూ బిజీగా ఉన్నారు. 

ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత వెబ్‌ సిరీస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు.

ఇండియన్ వెబ్‌ సిరీసుల్లో తనకు ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్  అంటే చాలా ఇష్టం అన్నారు. 

ఆ సిరీస్‌ తన మనసును కదిలించిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్‌ చేశారు. 

అయితే ఇదే సిరీస్‌లో సామ్ నటించడం... ఈ సిరీస్‌ గురించే నేషనల్ మీడియా ముందు చై పొగడడంతో... 

చై కామెంట్స్ మరో సారి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

మరో సారి వీరిద్దరూ కలుస్తారేమో అనే కామెంట్స్ వీళ్ల ఫ్యాన్స నుంచి వచ్చేలా చేస్తున్నాయి.