క్లారిటీ ఇస్తానంటున్న చైతూ..
TV9 Telugu
19 March 2024
ఏంటి కన్‌ఫ్యూజ్ అయ్యారా? మరిన్ని క్లూస్ కావాలా? అయితే మార్చి 19దాకా ఆగండి అంటున్నారు హీరో నాగచైతన్య.
ఏం ప్లాన్ చేశావ్ మావా అంటూ ప్రైమ్ వీడియోని ట్యాగ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు నాగ చైతన్య అభిమానులు.
తాజాగా అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగచైతన్య ఇచ్చిన ఓ అనౌన్స్ మెంట్‌లో ఆయన చేతిలో పత్రిక కనిపించింది.
రీసెంట్‌గా ఆయన పత్రిక ఎడిటర్‌గా కనిపించింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న వెబ్‌సీరీస్ దూతలోనే.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన వెబ్ సీరీస్ అది. ఇది బ్లాక్ బస్టర్ గా భారీ వ్యూస్ తో దూసుకుపోయింది.
దూత గ్రాండ్ సక్సెస్ కావడంతో, దూత సీజన్2కి సంబంధించి అనౌన్స్ మెంట్ ఇస్తారంటూ నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది.
నాగచైతన్య డిజిటల్ డెబ్యూని గ్రాండ్ సక్సెస్ చేసిన సీరీస్ ఇది. ప్రస్తుతం చైతూ తండేల్ మూవీలో నటిస్తున్నారు.
ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాకిస్తాన్ జైల్ సెట్ కూడా వేశారు. ప్రస్తుతం ఆ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి