'కొత్త బంగారు లోకం' మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరోలు ఎవరంటే ??
TV9 Telugu
టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘కొత్త బంగారు లోకం’. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించారు.
ఈ సినిమాలోని కథ.. పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో సన్నివేశాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.
ఈ సినిమాతో అమ్మాయిల్లో వరుణ్ సందేశ్ కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్నారు వరుణ్.
ఇక అసలు విషయం ఏంటంటే..! ‘కొత్త బంగారు లోకం’ కోసం ముందుగా ఇద్దరు హీరోలను సంప్రదించారట. కానీ ఆ ఇద్దరు వదిలేయడంతో ఆ ఛాన్స్ వరుణ్ వద్దకు వచ్చింది.
శ్రీకాంత్ అడ్డాల తన సినిమాకు కొత్త హీరో కావాలనుకున్నారు. అదే సమయంలో నాగచైతన్య తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలిస నాగార్జునను సంప్రదించారట.
కథ విన్న నాగ్.. యాక్షన్ నేపథ్యం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇక ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని కలిసి ఈ మూవీ స్టోరీ చెప్పారట శ్రీకాంత్.
కథ విన్న రామ్ పోతినేని.. ఈ మూవీలో హీరో పాత్ర కాలేజీ స్టూడెంట్ కావడంతో తనకు పాత్ర సెట్ కాదని నో చెప్పారట.