స్టార్ హీరో సినిమాలో యంగ్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ఇక రచ్చే..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తాజాగా మరో క్రేజీ ఆఫర్ అందుకుంది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఆ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసంది.
ఆమె మరెవరో కాదు.. యంగ్ హీరోయిన్ నభా నటేష్. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.
తాజాగా ఈ అమ్మడుకు మరో క్రేజీ ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని బీటౌన్ స్టార్ సన్నీ డియోల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.
పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్ట్ సినిమాగా వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నట్లు టాక్.
ఇందులో రెజీనా కసాండ్రా కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. అందులో యంగ్ బ్యూటీ నభా నటేష్ నటించనుందని సమాచారం.
దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటికే హైదరాబాద్ లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరిగిందట.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది నభా నటేష్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన లెహాంగా ఫోటోస్ కుర్రకారును కట్టిపడేస్తున్నాయి.