ఆ మూవీ సెట్స్‌లో నభా.. బాలీవుడ్‌కు ప్రగ్యా జైస్వాల్..

TV9 Telugu

05 April 2024

అనుకోని ప్రమాదంతో మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నారు నభా నటేష్. ఈమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ అవుతున్నారు.

ఈ మధ్యే ప్రియదర్శితో ఓ సినిమాకు సైన్ చేసిన ఈమె.. తాజాగా నిఖిల్ పాన్ ఇండియా సినిమా స్వయంభులో అవకాశం అందుకున్నారు.

యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ సెట్ లోకి అడుగు పెట్టారు ఈమె. నభా నటేష్ సెట్స్‌లోకి వస్తున్న వీడియోను విడుదల చేసారు మేకర్స్.

హమరేష్, ప్రాథన సందీప్ జంటగా వాలి మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా సత్య. ఈ సినిమాను శివం మీడియా బ్యానర్‌పై శివ మల్లాల నిర్మిస్తున్నారు.

తాజాగా సత్య చిత్ర టీజర్ విడుదలైంది. స్కూల్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్నా చిత్రమిది.

కంచె, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.

తాజాగా ఈమె బాలీవుడ్‌కు వెళ్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా.. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టి సిరీస్ నిర్మిస్తున్నారు.

ఇందులో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు వయ్యారి భామ ప్రగ్య జైస్వాల్. ఇది ఈ ముద్దుగుమ్మ తొలి బాలీవుడ్ చిత్రం.