యంగ్ హీరోను టార్గెట్ చేసిన హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
నభా నటేష్.. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న స్వయంభు సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఇన్ స్టాలో ప్రభాస్ డార్లింగ్ మాటల మీద ఫన్నీగా ఓ రీల్ చేసింది.
నభా షేర్ చేసిన వీడియోపై నటుడు ప్రియదర్శి రియాక్ట్ అవుతూ డార్లింగ్ అదరగొట్టేశావ్ అని స్పందించారు. ప్రియదర్శి కామెంట్ పై సీరియస్ అయ్యింది నభా..
ఏయ్ మిస్టర్.. మాట్లాడేముందు జాగ్రత్త.. డార్లింగ్ అని తెలియనివాళ్లని పిలిస్తే నేరం అని కౌంటరివ్వగా.. అవునా నువ్వెప్పుడు నాకు తెలియని వ్యక్తివి అని రిప్లై ఇచ్చాడు దర్శి.
అలాగే ఎందుకు వై దిస్ కొలవరీ అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. అయితే వీరిద్దరి డార్లింగ్ పంచాయితీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
తాజాగా వీరిద్దరి గొడవలోకి రీతూ వర్మను తీసుకొచ్చారు. ఆమె పోస్టులపై ప్రియదర్శి రియాక్ట్ అవుతూ డార్లింగ్.. అద్భుతంగా ఉన్నావ్ అంటూ కామెంట్ చేశాడు.
ఇక ప్రియదర్శి చేసిన కామెంట్ పై నభా రియాక్ట్ అవుతూ అగో.. మళ్లీ డార్లింగ్ అంటున్నాడు అంటూ కౌంటరిచ్చింది. దీంతో రీతూ వర్మ రంగంలోకి దిగింది.
నా పోస్ట్ కింద కామెంట్ సెక్షన్లో మీ గోల ఏంటీ ? అంటూ ఫైర్ అయ్యింది రీతూ వర్మ. వీరి ముగ్గురి డార్లింగ్ సంబాషణలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఇది గోల కాదు డార్లింగ్, నీ మీదున్న ఆరాధన .. నువ్వే నభాకి చెప్పు అంటూ దర్శి యాక్ట్ కాగా.. నభా, దర్శి సినిమా ప్రమోషన్ అని అంటున్నారు నెటిజన్స్.