తన అందంతో కుర్రకూరుకి పిచ్చేస్తున్న నభ..

TV9 Telugu

04 June 2024

11 డిసెంబర్ 1995న కర్ణాటకలో చిక్కమగళూరు జిల్లాలోని హిందూ పుణ్య క్షేత్రమైన శృంగేరిలో పుట్టి పెరిగింది వయ్యారి భామ నాభ నటేష్.

ఉడిపిలోని N.M.A.M ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందింది.

2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు పోటీల్లో టాప్ 11 జాబితాలో భాగంగా మిస్ ఇంటెలెక్చువల్ అవార్డును అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

తన 19వ ఏట కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌తో 2015లో వచ్చిన వజ్రకాయ చిత్రంతో నటనలో తన కెరీర్ ప్రారంభించింది ఈ అందాల భామ.

ఈ సినిమా కర్ణాటకలో అనేక థియేటర్లలో 100 రోజులకు పైగా సందడి చేసింది. 2017లో లీ, సాహెబా అనే రెండు కన్నడ చిత్రాల్లో కనిపించింది.

2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఇస్మార్ట్ శంకర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

డిస్కో రాజ, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ మాస్ట్రో వంటి చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించింది.

ప్రస్తుతం డార్లింగ్ వై దిస్ కలవారి అనే చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.