అందంతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న నభ నటేష్.. 

Prudvi Battula 

Credit: Instagram

07 February 2025

11 డిసెంబర్ 1995న కర్ణాటకలో చిక్కమగళూరు జిల్లాలోని పుణ్యక్షేత్రమైన శృంగేరిలో పుట్టి పెరిగింది వయ్యారి భామ నభా నటేష్.

ఉడిపిలోని N.M.A.M ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందింది.

2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు పోటీల్లో టాప్ 11 జాబితాలో భాగంగా మిస్ ఇంటలెక్చువల్ అవార్డును అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

తన 19వ ఏట కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌తో 2015లో వచ్చిన వజ్రకాయ చిత్రంతో నటనలో తన కెరీర్ ను ప్రారంభించింది ఈ అందాల భామ.

ఈ సినిమా కర్ణాటకలో అనేక థియేటర్లలో 100 రోజులకు పైగా సందడి చేసింది. 2017లో లీ, సాహెబా అనే రెండు కన్నడ చిత్రాల్లో కనిపించింది.

2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఇస్మార్ట్ శంకర్‎తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించింది.

ఇటీవల డార్లింగ్ వై దిస్ కలవెరి అనే చిత్రంలో కథానాయకిగా నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.