19 October 2025

అందాలతో సెగలు పుట్టిస్తోన్న వయ్యారి.. ఆఫర్స్ కోసం వెయిటింగ్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది 

చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తున్న ఈ వయ్యారి ఎవరంటే. 

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ నభా నటేష్. నన్ను దొచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందంతో కట్టిపడేసింది ఈ వయ్యారి.

తెలుగులో తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

ఈ సినిమాతో నభా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంటుందని అనుకున్నారు. కానీ అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది.

యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరమైన నభా నటేష్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ వయ్యారి.

అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా మినహా మరో ప్రాజెక్ట్ లేదు ఈ బ్యూటీ చేతిలో. 

మరోవైపు సోషల్ మీడియాలో ట్రెడిషనల్, గ్లామర్ ఫోటోలతో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులో ఈ బ్యూటీ మెస్మరైజ్ చేస్తుంది.