హాట్ హాట్‌గా నభా.. చూస్తే సెగలే.!

15 September 2023

హీరోయిన్ నభా నటేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమెకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ. ఆ సినిమా తర్వాత వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చింది.

రామ్ పోతినేనితో నటించిన 'ఇస్మార్ట్ శంకర్'.. నభా నటేష్‌కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా సూపర్ హిట్ అందుకుంది.

ఈ సినిమా అమ్మడు తన నటనతోనే కాదు.. అందచందాలతోనూ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది.

'ఇస్మార్ట్ శంకర్' తీసుకొచ్చిన ఫేంతో.. ఆ తర్వాత ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ లాంటి చిత్రాల్లో నటించింది.

ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరమైన నభా నటేష్.. ప్రస్తుతం సినిమాల పరంగా సైలెంట్ అయింది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం జోరు చూపిస్తోంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. డిఫరెంట్ లుక్స్‌, ఫోటో‌షూట్స్‌కు సంబంధించిన పిక్చర్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది నభా నటేష్.

ఇటీవల అదిరిపోయే అవుట్‌ ఫిట్లతో.. అదరగొట్టే హాట్ ఫోటోలతో నెట్టింట కుర్రకారుకు సెగలు రేపుతోంది హీరోయిన్ నభా నటేష్.