10 July 2025

ఆఫర్స్ కరువు.. ఆ పాన్ ఇండియా సినిమాపైనే అమ్మాడి ఆశలు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తొలినాళ్లల్లో వరుస ఆఫర్స్ అందుకుంది. 

ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది.

ఆమె మరెవరో కాదు .. హీరోయిన్ నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ భామ.

వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఒక్క యాక్సిడెంట్ తో ఇండస్ట్రీకి దూరమైంది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది నభా. 

డార్లింగ్ సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నిఖిల్ సరసన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. 

ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఫీమేల్ లీడ్ లో అలరించనుంది. డైరెక్టర్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. 

ఈ సినిమా గురించి వచ్చిన హైప్స్ మూవీపై ఆసక్తిని పెంచిగా.. ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా హిట్టవ్వడం  ఖాయమంటున్నారు.

ప్రస్తుతం నభా నటేష్ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ షోతో నెట్టింట ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇస్తుంది ఈ వయ్యారి.