లక్ అంటే ఈ అమ్మడిదే .. వరుసగా పాన్ ఇండియా సినిమా ఛాన్స్ లు 

Rajeev 

15 October 2024

 హీరోయిన్ నభానటేష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో కవ్విస్తోంది. 

2018లో సుధీర్ బాబు హీరోగా నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నభా నటేష్. 

ఈ సినిమా కంటే ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. అందంతో పాటు నటనతోనూ కవ్వించింది.

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ అందాల తార.

డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో ఇలా వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.

ఒక యాక్సిడెంట్ కారణంగా సుమారు మూడేళ్ల పాటు ఇంటికే పరిమితమైందీ అందాల భామ

ఇక ఇప్పుడు ఈ అమ్మడు తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ఇటీవలే డార్లింగ్ అనే సినిమా చేసింది. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైనప్ చేసింది.