ఆ హీరోతో నా కెమిస్ట్రీ సూపర్బ్ అంతే: నభా నటేష్
TV9 Telugu
14 July 2024
సుమారు ఆరేళ్ల క్రితం (2018) లో సుధీర్ బాబు 'నన్నుదోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగపెట్టింది హీరోయిన్ నభా నటేశ్.
మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుందీ మంగళూరు ముద్దుగుమ్మ
ఆ తర్వాత అదుగో, డిస్కోరాజా, ఇస్మార్ట్ శంకర్, సోలో బతుకే సో బెటర్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది నభా నటేష్.
అయితే గత నాలుగేళ్లుగా వెండితెరపై కనిపించలేదు నభా నటేష్. ఒక ప్రమాదం కారణంగా చాలా రోజుల పాటు ఇంటి పట్టునే ఉండిపోయింది.
మళ్లీ ఇప్పుడు డార్లింగ్ అంటూ ఓ క్రేజీ సినిమాతో మన ముందుకు రానుంది. బలగం మూవీ ఫేమ్ ప్రియదర్శి ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న నభా నటేష్.. డార్లింగ్ మూవీ హీరో ప్రియదర్శి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ప్రియదర్శితో తన కెమిస్ట్రీ అద్భుతంగా వర్క్ అయిందని, తను చాలా చిల్ పర్శన్ అని నభా నటేష్ చెప్పుకొచ్చింది.
ప్రియదర్శి కామెడీ టైమింగ్ చాలా నేచురల్‌గా ఉంటుందని, అతనితో కలిసి పని చేయడం చాలా బావుందని ప్రశంసలు కురిపించిందీ అందాల తార.
ఇక్కడ క్లిక్ చేయండి..