సంక్రాంతి వేళ సందడికి నా సామిరంగా సిద్ధం..
TV9 Telugu
12 January 2024
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రల్లో విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్న సినిమా నా సామిరంగా.
నాగార్జున 10వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటల ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆషిక రంగనాథ్ హీరోయిన్.
నాగ్ గత సినిమాల రికార్డులన్నింటినీ తుడిచేస్తూ యూ ట్యూబ్‌లో షేక్ చేస్తుంది నా సామిరంగా సినిమా ట్రైలర్.
ముఖ్యంగా పండగ కళ అంతా ట్రైలర్‌లోనే ఉందంటున్నారు అక్కినేని అభిమానులు. ఇది కచ్చితం హిట్ కొడుతుంది అంటున్నారు.
అల్లరి నరేష్ సరసన మంగ అనే పాత్రలో మిర్నా మీనన్, రాజ్ తరుణ్ కి జోడీగా రుక్సార్ ధిల్లాన్ కుమారి అనే పాత్రలో నటిస్తున్నారు.
నా సామిరంగా సినిమాలో రావు రమేష్, నాజర్, మధుసూదన్ రావు, రవివర్మ వంటి వారి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి