21 November 2023
పుష్ప 2 పై మరిన్ని అంచనాలు పెంచేసిన దేవి శ్రీ ప్రసాద్..
Pic credit - Instagram
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని అన్నారు. డీఎస్పీ కామెంట్స్ తో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్ గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే హైలెట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు దేవీ శ్రీ ప్రసాద్.
ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. అలాగే నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుందని తెలిపారు.
ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందని తెలిపారు డీఎస్పీ. గతంలో పుష్ప సినిమాలోని మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పటికే జాతర ఎపిసోడ్కు సంబంధించిన ఫస్లుక్ ఇఫ్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. గంగమ్మ తల్లిగా బన్నీ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నారు. ఇందులో రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.