09 June 2024

దెయ్యంగా మృణాల్.. హార్రర్ మూవీతో భయపెట్టనున్న అందాల సీత.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బాలీవుడ్‏‏లో వరుస సినిమాలు చేస్తున్నా మృణాల్ ఠాకూర్‏కు గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో సీతారామం మూవీతో బ్యూటీ క్రేజ్ మారిపోయింది. 

డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగింది. ఫాలోయింగ్ కూడా పెరిగింది.

ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది మృణాల్. నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ జోడిగా ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించింది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. 

ఈ క్రమంలో మృణాల్ ప్రేమకథలు కాకుండా హరర్ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందట. కాంచన సినిమాల సిరీస్‏లో ఈ బ్యూటీకి ఆఫర్ వచ్చిందని టాక్. 

ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని ఈ బ్యూటీ రెస్పాన్స్ కోసం చిత్రయూనిట్ వెయిట్ చేస్తుందని తెలుస్తోంది. కాంచనలో మృణాల్ దెయ్యంగా కనిపించునుందట. 

 ముని, కాంచన చిత్రాలతో తనకంటూ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసిన లారెన్స్ వాటితో వరుస హిట్స్ అందుకున్నాడు. హార్రర్ అయినా కడుపుబ్బా నవ్వించాడు. 

 ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా కాంచన 4 సినిమాను లారెన్స్ ట్రై చేస్తున్నాడట. సెప్టెంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ప్రకటించారు.